Home > తెలంగాణ > KTR : మతంపేరుతో బీజేపీ ఓట్లు దండుకోవాలని చూస్తోంది..

KTR : మతంపేరుతో బీజేపీ ఓట్లు దండుకోవాలని చూస్తోంది..

KTR : మతంపేరుతో బీజేపీ ఓట్లు దండుకోవాలని చూస్తోంది..
X

వచ్చే ఎన్నికల తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. ఎన్నికలకు రేవంత్ మరో ఏక్‌నాథ్ షిండే, హిమంత బిశ్వ శర్మ అవుతారని కేటీఆర్ అన్నారు. ఎన్నికలకు 2 నెలలు కూడా లేదు భవిష్యత్తులో మీ ఆశ్వీరాదం ఉండాలి అంటే ఏమన్నట్లు నువ్వే మళ్లీ ప్రధాని మోదీకి చెప్పినట్లు కాదని ఆయన ప్రశ్నించారు. గుజరాత్ మోడల్ అంటూ అంటు రేవంత్ పరువు తీశారని కేటీఆర్ మండిపడ్డారు. కాళేశ్వరం దండగా అంటూ కాంగ్రెస్ నాయకులు పబ్బం గడుపుకునే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగి పోతే రిపేర్ చేయకుండా కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా ముఖ్యమంత్రి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమపై కోపంతో నేతన్నలకు బతుకమ్మ చీరెలు ఆర్డర్ ఇవ్వడం లేదని అన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేసీఆర్ మీద బురద జల్లాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కరీంగనర్‌కు ఏం చేశారని ప్రశ్నించారు. మతం కులం పేరుతో ఓట్లు అడగడం తప్ప కరీంనగర్‌కు ఆయన ఏం చేయలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు..డిసెంబర్ 9న అన్ని హామీలు నేరవేరుస్తానని రేవంత్‌ మాట తప్పారని ఆక్షేపించారు. ఈనెల 12న కరీంనగర్‌లో ‘కదన భేరి’ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 9న అన్ని హామీలు నేరవేరుస్తానని సీఎం మాట తప్పారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ కేవలం 4 లక్షల ఓట్ల తేడాతోనే ఓడిపోయిందని అన్నారు.అయోధ్య పేరు మీద ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు.



Updated : 5 March 2024 7:16 PM IST
Tags:    
Next Story
Share it
Top