Home > తెలంగాణ > నుమాయిష్ మరో 3 రోజులు పొడిగింపు

నుమాయిష్ మరో 3 రోజులు పొడిగింపు

నుమాయిష్ మరో 3 రోజులు పొడిగింపు
X

ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ 83వ ఎగ్జిబిషన్ (నుమాయిష్- 2024).. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జనవరి 1వ తేదీన ప్రారంభం అయింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు.. 46 రోజులు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది. మరో 3 రోజుల్లో ఎగ్జిబిషన్ ముగియనుంది. కాగా మరో మూడు రోజులు నుమాయిష్ ను పొడగించుతున్నట్లు అధికారులు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15వ తేదీతో నుమాయిష్ ముగియాల్సి ఉంది. కానీ మరో మూడు రోజులు పొడిగించినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. ఎగ్జిబిషన్ ముగింపు దశకు చేరిన నేపథ్యంలో జనాలు భారీ సంఖ్యలో రావడం వల్ల రద్దీ పెరిగింది. కాగా విజిటింగ్ అవర్స్ లో ఎలాంటి మార్పులు చేయలేదు.

Updated : 12 Feb 2024 9:14 PM IST
Tags:    
Next Story
Share it
Top