Home > తెలంగాణ > Sivabalakrishna Bail Petition : శివబాలకృష్ణకు నాంపల్లి కోర్టు షాక్.. బెయిల్ పిటిషన్‌ కొట్టివేత

Sivabalakrishna Bail Petition : శివబాలకృష్ణకు నాంపల్లి కోర్టు షాక్.. బెయిల్ పిటిషన్‌ కొట్టివేత

Sivabalakrishna Bail Petition  : శివబాలకృష్ణకు నాంపల్లి కోర్టు షాక్.. బెయిల్ పిటిషన్‌ కొట్టివేత
X

అవినీతి కేసులో రెరా సెక్రటరీ శివబాలకృష్ణకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ఆయన బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. ఈ కేసులో ప్రాథమిక నివేదికను ఏసీబీ ప్రభుత్వానికి అందజేసింది. ఏసీబీ విచారణలో ఆయన పలువురి పేర్లు బయటపెట్టినట్లు తెలుస్తోంది. శివ బాలకృష్ణతో ఐఏఎస్ అరవింద్ కుమార్ ఉన్న సంబంధాలపై ఆరా తీసేందుకు ఏసీబీ సిద్ధమైంది. అరవింద్ కుమార్ను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి కోరింది. శివ బాలకృష్ణ దగ్గర ఐఏఎస్ అరవింద్ కుమార్ భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది.

శివ బాలకృష్ణ ఆస్తులు తవ్వేకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. సుమారు రూ.250 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. శివ బాలకృష్ణకు 214 ఎకరాల భూమి, 29 ప్లాట్లు, వివిధ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లలోని 7ఫ్లాట్లు, ఒక విల్లా ఉన్నట్లు విచారణలో తేలింది. ఇక బాలకృష్ణ బినామీలపై కూడా ఏసీబీ ఫోకస్ చేసింది. అతడి సోదరుడు నవీన్ కుమార్పై భారీగా ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు. జనగామ, గజ్వేల్, యాదాద్రి ప్రాంతాల్లో నవీన్, అరుణ దంపతులపై భూముల ఉన్నట్లు అధికారులు తెలిపారు.

హెచ్ఎండీఏ డైరెక్టర్గా శివబాలకృష్ణ మూడేళ్లు పనిచేశారు. ఈ సమయంలో 120కి పైగా అనుమతులు జారీ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. శంషాబాద్, ఘట్ కేసర్, శంకర్ పల్లి జోన్లో 120కి పైగా అనుమతులు జారీ చేసినట్లు తేల్చారు. ఈ క్రమంలో చేంజ్ ఆఫ్ ల్యాండ్ డాక్యమెంట్లను అధికారులు పరిశీలించారు. అతడి ఫోన్లు, ల్యాప్టాప్ల నుంచి కీలక విషయాలను సేకరిస్తున్నారు. గత పదేళ్లలో 15 ఫోన్లు మార్చినట్లు గుర్తించారు. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే అరవింద్ కుమార్ను విచారించనుంది.

Updated : 12 Feb 2024 5:38 PM IST
Tags:    
Next Story
Share it
Top