Home > తెలంగాణ > నాంపల్లి కోర్టు సంచలన తీర్పు.. ఈవ్ టీజర్కు జైలు శిక్ష

నాంపల్లి కోర్టు సంచలన తీర్పు.. ఈవ్ టీజర్కు జైలు శిక్ష

నాంపల్లి కోర్టు సంచలన తీర్పు.. ఈవ్ టీజర్కు జైలు శిక్ష
X

నాంపల్లి కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈవ్ టీజింగ్కు పాల్పడిన ఓ యువకుడికి జైలు శిక్ష విధించింది. ఒంటరిగా వెళ్తున్న మహిళను వేధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి నిందితున్ని దోషిగా తేల్చి జైలుకు పంపారు.





హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హఫీజ్‌ బాబానగర్‌కు చెందిన ఓ మహిళ ఈనెల 11న కూరగాయల కోసం మార్కెట్‌కు బయల్దేరింది. సదరు మహిళ ఒంటరిగా వెళ్తున్న విషయాన్ని గమనించిన మహమ్మద్‌ ఇర్ఫాన్‌ అలీ అనే యువకుడు బైక్ వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె వెనుక భాగంలో తాకుతూ ఇబ్బంది పెట్టాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితున్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు సాక్ష్యంగా ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాలో రికార్డైన వీడియోను సమర్పించారు. వీటి ఆధారంగా విచారణ జరిపిన 10వ స్పెషల్ మెట్రోపాలిటన్ కోర్టు నిందితుడు ఇర్ఫాన్‌ అలీకి 16 రోజుల జైలుశిక్ష విధించింది.




Updated : 16 Aug 2023 10:18 PM IST
Tags:    
Next Story
Share it
Top