రాజాసింగ్‌తో తలపడే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్
X
హైదరాబాద్ పాతబస్తీలోని గోషామహల్ నియోజకవర్గంలో పోటీచేయబోయే తమ అభ్యర్థి పేరును బీఆర్ఎస్ మంగళవారం ప్రకటించింది. నందకిషోర్ బిలాల్ వ్యాస్ తమ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతాడని వెల్లడించింది. నియోజవర్గ బీఆర్ఎస్ ఇన్ చార్జిగా పనిచేస్తున్న వ్యాస్ పలుకుబడి ఉన్న వ్యాపారి. ఆయన అసెంబ్లీ బరిలోకి దిగడం ఇదే తొలిసారి. 2014, 2018 ఎన్నికల్లో రాజాసింగ్ బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి ముఖేశ్ గౌడ్ అతనికి గట్టి పోటీ ఇవ్వగా 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమసింగ్ రాథోడ్ పోటీ ఇచ్చారు. రాజాసింగ్‌కు 61,854, రాథోడ్‌కు 44,120 ఓట్లు పడ్డాయి. ఈసారైనా గోషామహల్ కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ తన అభ్యర్థిని మార్చింది. కాంగ్రెస్ నుంచి మొగిలి సుజాత బరిలో ఉన్నారు. కాగా నాంపల్లి నుంచి సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో మొత్తం 119 నియోజక వర్గాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినట్లయింది.