Home > తెలంగాణ > మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలించిన కేంద్ర బృందం

మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలించిన కేంద్ర బృందం

మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలించిన కేంద్ర బృందం
X

మేడిగడ్డ బ్యారేజ్ను కేంద్ర బృందం పరిశీలించింది. కాళేశ్వరం ప్రాజెక్టు‌‌‌‌‌‌‌‌లో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు శనివారం కుంగిన ఘటనను కేంద్ర జలశక్తి శాఖ సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు మంగళవారం మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు.

సభ్యులు దాదాపు 2 గంటల పాటు బ్యారేజీని పరిశీలించారు. కుంగిన 20వ పిల్లర్ తోపాటు18, 19, 21వ పిల్లర్ల పరిస్థితిని అంచనావేశారు. పగుళ్లు వచ్చిన డ్యాం, క్రస్ట్ గేట్లను పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు.. బ్యారేజీ డిజైన్, నిర్మాణం వివరాలను రాష్ట్ర ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీ పటిష్టత, జరిగిన నష్టంపై ఓ అంచనాకు వచ్చిన కేంద్ర బృందం.. మీడియాకు ఎలాంటి వివరాలు చెప్పకుండా వెళ్లిపోయింది. పరిశీలనలో గమనించిన అంశాలు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సభ్యులు వీలైనంత తొందరగా కేంద్ర జల శక్తి శాఖకు నివేదిక ఇవ్వనున్నారు.




Updated : 24 Oct 2023 4:11 PM IST
Tags:    
Next Story
Share it
Top