National Jana Sena party : జనసేన పార్టీకి ‘జాతీయ జనసేన’ గుబులు.. ఎన్నికల్లో పోటీ
X
తెలంగాణలో జనసేన పార్టీ అడుగు పెట్టింది. బీజేపీతో పొత్త కురుదుర్చుకుని ఎన్నికల్లో పోటీ చేస్తుంది. కాగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆ పార్టీ గాజు గ్లాస్ గుర్తును హోల్డ్ లో పెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఆ పార్టీకి పెద్దగా గుర్తింపు లేకపోవడంతోనే సింబల్ ప్రాబ్లమ్ వచ్చిందని అంటున్నారు. తెలంగాణలో జనసేన కేవలం రిజిస్టర్డ్ పార్టీనే. రికగ్నైజ్డ్ పార్టీ కావాలంటే గత ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు.. పోలైన ఓట్లలో నిర్ణీత శాతం ఓట్లు పొందాల్సి ఉంటుంది. కాగా నింబంధనలకు దగిన ఓట్ల శాతం పొందని కారణంగా జనసేనకు గాజు గ్లాస్ గుర్తు దక్కలేదు.
కాగా కూకట్ పల్లి స్ఠానానికి మరో కొత్త తలనొప్పి వచ్చి పడింది. ‘జాతీయ జనసేన’ పార్టీకి చెందిన అభ్యర్థి ఒకరు కూడా కూకట్ పల్లి నుంచి బరిలోకి దిగుతున్నారు. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు కాగా జాతీయ జనసేన పార్టీ గుర్తు బకెట్. రెండు పార్టీల పేర్లే కాకుండా.. రెండు పార్టీల గుర్తులు కూడా ఇంచు మించు ఒకేళా ఉన్నాయి. దీంతో జనసేన అభ్యర్థుల్లో ఆందోళన మొదలయింది. తమకు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందని భావిస్తున్న కూకట్ పల్లిలో.. ఈ కొత్త సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. తమకు ఓటేసే ప్రజలు పొరపాటు పడే అవకాశం ఉందని అంటున్నారు.