Home > తెలంగాణ > మంత్రి పేషీలో కంత్రి.. జాతీయ స్థాయి క్రీడాకారిణికి వేధింపులు

మంత్రి పేషీలో కంత్రి.. జాతీయ స్థాయి క్రీడాకారిణికి వేధింపులు

మంత్రి పేషీలో కంత్రి.. జాతీయ స్థాయి క్రీడాకారిణికి వేధింపులు
X

తెలంగాణలో క్రీడాకారిణులపై వేధింపులకు సంబంధించి వరుస ఘటనలు వెలుగులోకి రావడం కలకలం రేపుతున్నాయి. హకీం పేట స్పోర్ట్స్ హాస్టల్ ఉదంతం మరువక ముందే మంత్రి పేషీలో పనిచేసే ఉద్యోగి వేధింపులు వ్యవహారం వైరల్‌గా మారింది. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పేషీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌‌గా పనిచేసే సురేందర్‌ అనే ఉద్యోగికి జాతీయ స్థాయి క్రీడాకారిణి బంధువుతో జరిపిన సంభాషణ వైరల్‌గా మారింది. తన కుమార్తె వరుసయ్యే అమ్మాయిని మంత్రి దగ్గర పనిచేసే ఉద్యోగి వేధిస్తున్నాడని తెలిసి ఓ వ్యక్తి వార్నింగ్ ఇచ్చిన సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదీ జరిగింది

ఇటీవల రాష్ట్ర క్రీడా మంత్రి పేషీకి జాతీయ స్థాయి క్రీడాకారిణి ఒకరు.. తన సమీప బంధువుతో వచ్చింది. ది. జాతీయ స్థాయి క్రీడాకారిణి అయినప్పటికీ ప్రోత్సాహం లభించడం లేదని , క్రీడా మంత్రిని కలిసి సాయం చేయాలని విన్నవించింది. దీంతో వివరాలను తన ఆఫీస్ లో పనిచేస్తున్న ఉద్యోగికి ఇచ్చి వెళ్లాలని మంత్రి సూచించారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఫోన్‌ నంబరు తీసుకున్న ఆ ఉద్యోగి(డేటా ఎంట్రీ ఆపరేటర్‌)... అసభ్యకరమైన మెసేజ్ లను పంపించాడు. పర్సనల్ ఫొటోలను పంపించాలని అడిగాడు.

ఆ మెస్సేజీ వేధింపులను ఆమె భరించలేకపోయింది. దీంతో ఆమె తనను మంత్రి వద్దకు తీసుకెళ్లిన బంధువుకు ఈ విషయం చెప్పింది. ఆ బంధువు వెంటనే అదే నెంబర్‌కు ఫోన్ చేశాడు. తమ అమ్మాయికి వల్గర్ మెస్సేజీలు పెడుతున్నావని? ఇంకా ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలతోనూ ఇలాగే వ్యవహరించావని తెలిసిందని నిలదీశాడు. అయితే.. ముందుగా సురేందర్ ఏమీ ఎరుగనట్టు నటించాడు. అలాంటిదేమీ లేదని బుకాయించబోయాడు. కానీ, తన వద్ద మెస్సేజీల వివరాలు ఉన్నాయని, ఆధారాలు ఉన్నాయని క్రీడాకారిణి బంధువు పక్కాగా మాట్లాడాడు. అంతేకాదు, ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లుతానని వార్నింగ్ ఇచ్చాడు.

దీంతో సురేందర్ దారిలోకి వచ్చాడు. తనను మన్నించాలని, తప్పు చేశానని వేడుకున్నాడు. ఈ విషయాన్ని మనసులోనే పెట్టుకోవాలని, మంత్రికి చెబితే తన ఉద్యోగం ఊడి రోడు మీద పడుతుందని అన్నాడు. సురేందర్ రెడ్డి వ్యవహారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టి కి వెళ్లింది. దీంతో మారు ఆలోచించకుండా సురేందర్‌ను విధుల నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తొలగించేశారు. రెండు వారాల నుంచి ఆ ఉద్యోగి విధులకు రావడం లేదని, అతనిపై చర్యలు తీసుకుంటామని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.

Updated : 15 Aug 2023 5:31 AM GMT
Tags:    
Next Story
Share it
Top