Home > తెలంగాణ > TSRTC : టీఎస్ఆర్టీసీకి అవార్డుల పంట..ఏకంగా ఐదు నేషనల్ అవార్డులు

TSRTC : టీఎస్ఆర్టీసీకి అవార్డుల పంట..ఏకంగా ఐదు నేషనల్ అవార్డులు

TSRTC : టీఎస్ఆర్టీసీకి అవార్డుల పంట..ఏకంగా ఐదు నేషనల్ అవార్డులు
X

టీఎస్ఆర్టీసీకి నేషనల్ లెవల్ లో అవార్డులు దక్కాయి. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏఎస్‌ఆర్‌టీయూ అందించే ప్రతిష్టాత్మక నేషనల్‌ బస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు టీఎస్ఆర్టీసీని వరించాయి. మొత్తం ఐదు విభాగాల్లో టీఎస్ఆర్టీసీకి అవార్డులు రాగా.. అందులో నాలుగింటిలో ఫస్ట్ ప్లేస్ రావడం విశేషం.

తెలంగాణ టీఎస్ఆర్టీసీకి జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండింది. 2022-23లో రోడ్ సేఫ్టీ, ఎనర్జీ నిర్వహణ, వెల్ఫెర్ డిపార్ట్మెంట్, టెక్నికల్ యూసెజ్ వంటి కేటగిరీల్లో ఈ పురస్కారాలు దక్కాయి. వీటిల్లో అర్బన్‌ విభాగంలో తప్ప మిగితా అన్ని కేటగిరిల్లో ఆర్టీసీ ప్రథమ బహుమతి అందుకుంది. అయితే ఈ ఐదు అవార్డులను ఈ నెల 15న ఢిల్లీలో టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందజేయనున్నట్టు ఏఎస్‌ఆర్‌టీయూ తెలిపింది. నేషనల్ లెవల్ లో అవార్డులు అందుకొవడం పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు. సిబ్బంది నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయడం వల్లే సంస్థకు ఈ పురస్కారాలు దక్కాయని కొనియాడారు. అవార్డులు వచ్చేలా కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు చెప్పారు. టీఎస్‌ఆర్టీసీ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ అన్నారు. సంస్థ అభివృద్ధికి, ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషికి ఈ అవార్డులు నిదర్శనమని చెప్పుకొచ్చారు.

Updated : 2 March 2024 5:45 PM IST
Tags:    
Next Story
Share it
Top