Kaleswaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనానికి కమిటీ వేసిన NDSA
X
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరంపై ప్రత్యేక నజర్ పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందనేది కాంగ్రెస్ ఆరోపణ. మేడిగడ్డ కుంగుబాటు సహా కాళేశ్వరం అవినీతిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడతామని చెప్పినా.. హైకోర్టు సిట్టింగ్ జడ్జిని కేటాయించలేదు. దీంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అదేవిధంగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ గతంలో తెలిపారు.
ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనానికి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ వేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అధ్యయనానికి కమిటీని నియమించింది.సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్గా ఐదుగురు సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా యూసీ విద్యార్థి, ఆర్ పాటిల్, శివ కుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్, అమితాబ్ మీనా ఉన్నారు. మూడు బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల తీరు, డ్యామేజీకి గల కారణాలను కమిటీ పూర్తి స్థాయిలో పరిశీలించనుంది. 4 నెలల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ కమిటీ రిపోర్టు సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా రేవంత్ సర్కార్ తదుపరి చర్యలు తీసుకోనుంది.