Home > తెలంగాణ > మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికి నీలం మ‌ధు

మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికి నీలం మ‌ధు

మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికి నీలం మ‌ధు
X

యువ నాయకుడు నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు చిట్కూల్ నుంచి భారీ ర్యాలీతో గాంధీభవన్‌కు చేరుకున్న ఆయనకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా నీలం మధు మాట్లాడారు. పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఇందిరమ్మ స్పూర్తితో సామాన్యలను న్యాయం, ప్రజాపాలలో తన వంతు పాత్ర కృషి చేస్తానని ఆయన తెలిపారు. దేశంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, రాజకీయ పార్టీలు తమ గెలుపు అవకాశాలు పెంచుకోవటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. మెదక్‌ స్థానాన్ని దక్కించుకునే ప్రయత్నాల్లో నీలం మధును మళ్లీ పార్టీలోకి తీసుకున్నారని తెలుస్తోంది. గులాబీ పార్టీ కి కంచుకోట అయినా మెదక్ లోక్ సభ స్థానంలో తమ గెలుపు అవకాశాలను మెరుగు పరుచుకోవడానికి కూడా తెలంగాణ లో అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. నీలం మధు గ్రామ సర్పంచ్ గెలిచి బీఆర్‌ఎస్ పార్టీలో యువ నాయకుడుగా ఒక వెలుగు వెలిగినాడు. యూత్‌లో మంచి పాలోయింగ్ సంపాదించాడు. సోషల్ మీడియాలో బాగా పాపులర్‌య్యాడు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ముదిరాజ్ సామాజిక వర్గాన్నికి ఒక సీటు కూడా కేటయించలేదు. దీంతో మధు బీఆర్‌ఎస్ పార్టీకి గుడ్‌బైకి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరాడు. హస్తం పార్టీ మొదట జాబితాలో పటాన్ చెరు కాంగ్రెస్ టికెట్ నీలం మధుకి కేటయించింది. మంత్రి దామోదర చోరవతో కాటా శ్రీనివాస్ గౌడ్ టికెట్ దక్కింది. అనంతరం మధు బీఎస్పీ పార్టీలో చేరి పటాన్ చెరు నియోజక వర్గం నుంచి పోటి చేసి దాదాపు 50 వేలు సంపాదించాడుజిల్లాలో సీనియర్ నాయకుడు, ఇప్పటి ఆరోగ్యశాఖ ఆమాత్యులు దామోదర రాజనరసింహ కాటా శ్రీనివాస్ గౌడ్ కు మద్దతుగా నిలవగా, మరొక సీనియర్ నాయకుడు జగ్గా రెడ్డి మధుకు అండగా నిలిచాడు. ఈ పరిణామాల మధ్య, కాంగ్రెస్ నాయకత్వం మల్లి టికెట్ కాటా శ్రీనివాస్ గౌడ్ కి వచ్చింది. ఎలాగైనా ఎన్నికల్లో పోటీలో నిలవాలి అనే సంకల్పంతో, మధు బీఎస్పీ నుండి ఎన్నికల బరిలో దిగాడు. కాటా శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి చేతిలో 7 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు మద్యల విబేధాలు కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో, నీలం మధు మల్లి కాంగ్రెస్ పార్టీ లో చేరటం ఎలా దారి తీస్తుందోనని, అన్ని వర్గాల రాజకీయ నాయకులూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Updated : 15 Feb 2024 7:43 PM IST
Tags:    
Next Story
Share it
Top