గంధం చెట్ల స్మగ్లింగ్ కేసులో వీడిన మిస్టరీ
X
నెహ్రు జులాజికల్ పార్క్ లో గంధం చెట్ల స్మగ్లింగ్ వెనుక ఇంటి దొంగల పాత్ర ఉన్నట్లు తేలింది. అందరూ ఊహించినట్లే స్మగ్లర్లతో చేతులు కలిపిన నలుగురు సిబ్బంది గంధపు చెట్లను మాయం చేశారు. స్మగ్లర్లు క్రూర మృగాలుండే డేంజర్ జోన్ లోకి వెళ్లేందుకు ఈ నలుగురు సహకరించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. స్మగ్లింగ్ దృశ్యాలు ఎవరి కంట పడకుండా సీసీ కెమెరాల కనెక్షన్ కట్ చేసినట్లు తేలింది.
నలుగురు జూ సిబ్బంది డేంజర్ జోన్‌లోని గంధపు చెట్ల మార్కింగ్ వివరాలను స్మగ్లర్లకు అందజేశారు. అంతేకాదు గంధపు చెట్ల నరికి తీసుకెళ్లేందుకు సాయం చేశారు. జూ సిబ్బంది ఉపయోగించే వాహనాల్లో స్మగ్లర్లను వెంట తీసుకుని వెళ్లి అక్కడి నుండి గంధపు దుంగలను ప్రహరీ గోడ దాటించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. గతంలో జరిగిన స్మగ్లింగ్ వెనుక కూడా వీరి హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఆరు సార్లు స్మగ్లింగ్ కు పాల్పడినట్టు భావిస్తున్నారు.