Home > తెలంగాణ > రండి బాబు రండి అగ్వ అగ్వ...సబ్‌స్టేషన్‌ అమ్ముతా.. కొంటారా ?

రండి బాబు రండి అగ్వ అగ్వ...సబ్‌స్టేషన్‌ అమ్ముతా.. కొంటారా ?

రండి బాబు రండి అగ్వ అగ్వ...సబ్‌స్టేషన్‌ అమ్ముతా.. కొంటారా ?
X

స్థానికంగా పవర్ సబ్‌స్టేషన్‌ నిర్మిణానికి స్థలం కావాలన్నారు. నేతలు, అధికారలు అందుకు బదులుగా ఉద్యోగం ఇస్తామన్నారు. నా భూమి ఇస్తే గ్రామానికి కరెంట్ వస్తుందని, తనకు ఉద్యోగం దొరుకుతుందని ఆ రైతు ఆశపడ్డాడు. అధికారులు కోరనినట్లుగానే భూమిని డొనేట్ చేశాడు. పవర్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తైంది. అయితే ఈ సబ్‌స్టేషన్‌ నిర్మించి 9ఏళ్లు గడుస్తున్నా ఆ రైతుకు మాత్రం న్యాయం జరగలేదు. అధికారులు ఇచ్చిన హామీ నెరవేరలేదు. దీంతో కడుపురగిలిపోయిన ఆ అన్నదాత వినూత్న నిరసనకు దిగాడు. అది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికంగా హాట్ టాపిక్‎గా మారింది.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాదారం గ్రామానికి చెందిన రైతు ఆకుల నరసింహారావు 2014లో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి 12 గుంటల భూమిని ప్రభుత్వానికి దానంగా ఇచ్చాడు. రైతు భూమి ఇచ్చినందుకుగాను సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పని కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆ హామీ అధికారులు నెరవేర్చకున్నా తానే పైసా కూడా తీసుకోకుండా సబ్‌స్టేషన్‌‎లో ఉచితంగా పని చేస్తూ వచ్చాడు. తనకు ఉద్యోగం ఇవ్వాలంటే గతంలో ఆకుల నరసింహారావు పలుసార్లు నిరసన చేశారు. ఒకసారి సూసైడ్‎కి కూడా ప్రయత్నించారు అయినా ఆయన సమస్యకు పరిష్కారం లభించలేదు. దీంతో విసుగెత్తిన ఆకుల నరసింహారావు బుధవారం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ దగ్గరకు చేరుకుని అక్కడఓ ఫొటో దిగి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఈ సబ్‌స్టేషన్‌ అమ్ముతున్నా కావాలనుకున్నవారు నన్ను సంప్రదించండి అని కోరాడు. దీంతో ఈ న్యూస్ పెద్ద వైరల్ అయ్యింది. ఈ విషయం గురించి రైతును అడగ్గా.. అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం తనకు ఉద్యోగమైనా ఇవ్వాలని, లేకపోతే ఎకరం భూమి అయినా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మరి ఈ అంశంపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Updated : 14 Sept 2023 11:07 AM IST
Tags:    
Next Story
Share it
Top