కరంనగర్ చుట్టూ టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం
X
టీఎన్సీఎస్సీ లీకేజి వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ లోని ఇద్దరిని సిట్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
టీఎన్పీఎస్సీ లీకేజీ వ్యవహారం మొత్తం కరీంనగర్ చుట్టూ తిరుగుతోంది. అక్కడి ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న విశ్వప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లులను సిట్ అదుపులోకి తీసుకుంది. వీళ్ళిద్దరిని కలిపి ఇప్పటివరకు అరెస్ట్ చేసిని వారి సంఖ్య 53కు చేరింది.
మాస్ కాపీయింగ్ లో వీరిద్దరి పాత్ర ఉన్నట్టు గుర్తించారు సిట్ అధికారులు. డీఈఈ పూల రమేష్ తో డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో తెలిసింది. మొత్తం 10 లక్షలకు డీల్ కుదిరింది. ఈ 53 మందేకాక మరో 50 మంది దాకా ప్రశ్నాపత్రాల లీకేజి, మాస్ కాపీయింగ్ లో నిందితులు ఉన్నారని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. దీని బట్టి మరిన్ని అరెస్ట్ లు జరగొచ్చని చెబుతున్నారు.