Home > తెలంగాణ > NIA: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ కలకలం.. 50 చోట్ల ప్రజాసంఘాల నేతల ఇళ్లపై దాడులు

NIA: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ కలకలం.. 50 చోట్ల ప్రజాసంఘాల నేతల ఇళ్లపై దాడులు

NIA: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ కలకలం.. 50 చోట్ల ప్రజాసంఘాల నేతల ఇళ్లపై దాడులు
X

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పలు చోట్ల ముమ్మర దాడులు చేస్తోంది. పలు ప్రజాసంఘాల నాయకుల ఇళ్లలో సోదాలకు దిగింది. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, తిరుపతి, గుంటూరు సహా పలు ప్రాంతాల్లో సోమవారం తెల్లారుజామునుంచే దాడులు మొదలయ్యాయి. 50 చోట్ల ఏకకాలంలో దాడులు సాగుతున్నాయి. పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టులకు సహకరించారన్న ఆరోపణలపై ఇళ్లలోనూ, ఆఫీసుల్లోనూ సోదాలు చేస్తున్నారు.

హైదరాబాద్‌ విద్యానగర్‌లోని పౌర హక్కుల సంఘం నేత సురేష్, న్యాయవాది లాయర్‌ భవాని ఇంట్లో సోదాలు సాగుతున్నాయి. విజయవాడలో విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడు అరసవల్లి కృష్ణ ఇంట్లో, గుంటూరు జిల్లా పొన్నూరు ప్రజావైద్యకళాశాలలో, డాక్టర్ రాజారావు ఇంట్లో, నెల్లూరులో ఏపీ సీఎల్‌సీ నేతలు వెంకటేశ్వర్లు, అరుణ ఇళ్లలో, తిరుపతిలోని న్యాయవాది క్రాంతి చైతన్య ఇంట్లో తనిఖీలు సాగుతున్నాయి. అనంతపురంలోని కుల నిర్మూలన పోరాట సంఘం(కేఎన్‌పీఎస్) నేత, ఉపాధ్యాయుడు శ్రీరాములు, శ్రీకాకుళం కేఎన్‌పీఎస్ నేత కుమిస్కా కృష్ణయ్య, రాజమండ్రి న్యాయవాది నాజర్‌, నెల్లూరులోని హక్కుల నేత ఎల్లంకి వెంకటేశ్వర్లు తదితరుల ఇళ్లలోని పుస్తకాలను, కంప్యూటర్లను తనిఖీ చేస్తున్నారు.

Updated : 2 Oct 2023 11:06 AM IST
Tags:    
Next Story
Share it
Top