Home > తెలంగాణ > ఆర్థికలోటును కేసీఆర్ సర్కార్ దాచిపెడుతోంది : నిర్మల

ఆర్థికలోటును కేసీఆర్ సర్కార్ దాచిపెడుతోంది : నిర్మల

ఆర్థికలోటును కేసీఆర్ సర్కార్ దాచిపెడుతోంది : నిర్మల
X

బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణను అన్ని విధాల భ్రష్టు పట్టించిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్థికలోటును కేసీఆర్ ప్రభుత్వం దాచిపెడుతోందని ఆరోపించారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పాటైన తెలంగాణ ఇప్పుడు రుణాల మయమైందన్నారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సరిగా లేదని.. భవిష్యత్ తరాల ప్రజలపై రుణభారం మోపుతున్నారని మండిపడ్డారు.

దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మారుతోందని.. అయినా రాష్ట్ర ప్రభుత్వం అవేమి పట్టనట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు.

కేసీఆర్ అవినీతితో కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లర్లు కూలిపోతున్నాయని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై విచారణ జరుపుతామన్నారు. రూ.3,300 కోట్లు బీసీల అభివృద్ధి కోసం వినియోగిస్తామని చెప్పి.. కేవలం రూ.77కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. మిగితా డబ్బు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పాటైన రాష్ట్రంలో ఇవేవీ నెరవేరలేదని అన్నారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని.. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Updated : 21 Nov 2023 5:31 PM IST
Tags:    
Next Story
Share it
Top