Home > తెలంగాణ > ఎంపీ అర్వింద్కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తల ఆందోళన

ఎంపీ అర్వింద్కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తల ఆందోళన

ఎంపీ అర్వింద్కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తల ఆందోళన
X

అంతర్గత కుమ్ములాటలు బీజేపీకి తలనొప్పిగా మారాయి. కాంగ్రెస్లోనే గ్రూప్ రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు ఎక్కువనే అనుకంటే.. తెలంగాణ బీజేపీలో అంతకుమించి కుమ్ములాటలు నెలకొన్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇంతకుముందు రఘునందన్ రావు, ఈటల, రాజగోపాల్ రెడ్డి పార్టీ తీరుపై అసంతృప్తిగళం వినిపించగా.. ఇప్పుడు కార్యకర్తలకు అది పాకింది.

నిజామాబాద్ ఎంపీ అర్వింద్కు వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. జిల్లాలో మండలాధ్యక్షుల నియామకంపై స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు. అర్వింద్ అకారణంగా 13మంది మండలాధ్యక్షులను తొలగించి.. తనకు కావాల్సిన వారికి పదవులు కట్టబెట్టారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.

ఇవాళ పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట కార్యకర్తలు నిరసనకు దిగారు. సేవ్ బీజేపీ ప్లకార్డులు ప్రదర్శించి అర్వింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యకర్తల ఆందోళనపై ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీనర్సయ్య ముఖం చాటేశారు. అయితే ఈ నిరసనపై ఎంపీ అర్వింద్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.



Updated : 31 July 2023 7:46 AM GMT
Tags:    
Next Story
Share it
Top