రాష్ట్రంలో మరో మెడికో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
X
రాష్ట్రంలో మరో మెడికో సూసైడ్ అటెంప్ట్ కలకలం రేపింది. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతున్న ఖుష్బు (20) అనే విద్యార్థిని ఏవో మాత్రలు మింగి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఈ సంఘటన అధివారం జరిగింది. రాజస్థాన్ కు చెందిన ఖుష్బు.. మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. అయితే కారణాలు తెలియవు కానీ.. ఆదివారం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటన సోమవారం ఉదయం అలస్యంగా వెలుగు చూసింది.
సదరు విద్యార్థిని అపస్మారక స్థితికి చెరుకోవడంతో జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఖుష్భు అత్మహత్యకు హస్టల్‌లో ఉండే మరో విద్యార్థినితో గొడవ కారణం అని మెడికల్ కాలేజీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నదని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు. వైద్య విద్యార్థిని అత్మహత్య యత్నానికి వేధింపులే కారణం అనే వాదనలు ఉన్నాయి. వేదింపులు భరించలేకనే శనివారం 5 మాత్రలు, అదివారం 10 మాత్రలు ఓవర్ డోస్ అయ్యేలా వేసుకుని అత్మహత్య యత్నం చేసినట్లు తెలిసింది.
ఈ వ్యవహరం బయటకు పోక్కకుండా అధికారులు చాలా ప్రయత్నాలు చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో నాలుగు నెలల కాలంలో ఒక విద్యార్థి అత్మహత్య చేసుకోగా, మరో విద్యార్థిని అత్మహత్య యత్నం చేయడం కలకలం రేపుతోంది. ఆసుపత్రి అధికారులు మాత్రం పారసిటమాల్ ట్యాబ్లేట్ వేసుకుని అత్మహత్య యత్నం చేసిందని చెబుతుండగా, స్థానికంగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీస్ అధికారులు చెబుతున్నారు.