Telangana Elections 2023: నిజామాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మహత్య
X
నిజామాబాద్ అర్బన్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్తిగా బరిలోకి దిగిన కన్నయ్యగౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సాయినగర్ లోని తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సైబర్ మోసగాళ్లు, లోన్ యాప్ వేధింపుల వల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కన్నయ్య కుమార్ గౌడ్ ఫోన్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారని.. తన ఎన్నికలు అఫిడవిట్ ను కూడా సైబర్ నేరగాళ్లు కాజేసినట్లు చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో గృహ ప్రవేశం పెట్టుకున్న కన్నయ్య ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబాన్ని తీరని విషాదంలోకి నెట్టింది. ఫోన్ హ్యాక్ చేసిన నేరగాళ్లపై పోలీసులు యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు చెప్పారు.