Home > తెలంగాణ > విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రతి నాలుగో శనివారం నో బ్యాగ్‌ డే

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రతి నాలుగో శనివారం నో బ్యాగ్‌ డే

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రతి నాలుగో శనివారం నో బ్యాగ్‌ డే
X

జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన షెడ్యూల్​ను తెలంగాణ విద్యాశాఖ ఖరారు చేసింది. వచ్చే సోమవారం నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమై.. ఏప్రిల్ 24 చివరి పని దినంగా ప్రకటించింది. ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 తేదీ వరకూ వేసవి సెలవులు కాగా.. 2023-24 ఏడాదిలో మొత్తం 229 పనిదినాలు ఉండనున్నాయి. జనవరి 10 తేదీ లోపు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాల్సి ఉంటుందని విద్యాశాఖ కార్యదర్శి కరుణ వాటిక తెలిపారు. మంగళవారం ఆమె 202324 విద్యాసంవత్సర అకడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేశారు.



ఇక మార్చిలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు, జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు, డిసెంబర్‌ 22 నుంచి 26 తేదీ వరకూ క్రిస్మస్‌ సెలవులు ఉంటాయని ప్రకటించారు. ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వారికి ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ ఏడాది నుంచి కొత్తగా పాఠశాలల్లో ప్రతీ రోజూ విద్యార్థులకు ఐదు నిమిషాల పాటు యోగ, ధ్యానం తరగతులు ఉంటాయన్నారు. రాష్ట్రంలోని బడుల్లో విద్యార్థులను రోజుకు 30 నిమిషాలపాటు చదివించాలని సూచించారు. ఇందుకోసం రీడింగ్‌ యాక్టివిటీని నిర్వహించాలన్నారు. ఈ 30 నిమిషాల వ్యవధిలో పాఠ్యపుస్తకాలతోపాటు కథల పుస్తకాలు, దినపత్రికలు, మ్యాగ్జి న్లు చదివించాలని ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆదేశించారు. రోజూ ఉదయం, సాయంత్రం బడుల్లో ధ్యానం, యోగ తప్పనిసరి చేశారు. విద్యార్థులను ఒత్తిడి నుంచి దూరం చేయడంలో భాగంగా ఆర్ట్‌ అండ్‌ హెల్త్‌ యాక్టివిటీస్‌, మెంటల్‌ మ్యాథ్స్‌గేమ్స్‌, వర్డ్‌ అంత్యాక్షరి, మ్యూజిక్‌, డ్యాన్స్‌ కార్యకలాపాలను నిర్వహిస్తారు. నెలలో నాలుగో శనివారం ‘నో బ్యాగ్‌డేగా’ పాటించనున్నారు.

మరికొన్ని ముఖ్యాంశాలిలా..

వారంలో ప్రాథమిక తరగతులకు 14, ప్రాథమికోన్నతకు 9, ఉన్నత పాఠశాల విద్యార్థులకు 8చొప్పున సహ పాఠ్య కార్యక్రమాలను(కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌) నిర్వహిస్తారు.

ఏడాదిలో రెండుసార్లు విద్యార్థులకు వైద్యపరీక్షలు చేసి హెల్త్‌కార్డుల్లో వివరాలు నమోదు చేస్తారు

.రోజూ అన్ని తరగతులకు డిజిటల్‌ పాఠాలు బోధిస్తారు.

నవంబర్‌/డిసెంబర్‌ నెలల్లో రాష్ట్రస్థాయి ఎగ్జిబిషన్‌.

Updated : 7 Jun 2023 7:03 AM IST
Tags:    
Next Story
Share it
Top