Mayor Mekala Kavya : మల్లారెడ్డికి షాకిచ్చిన కార్పొరేటర్లు.. మేయర్‌పై నెగ్గిన అవిశ్వాసం
X
రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అవిశ్వాసాల పర్వం నడుస్తోంది. ఇప్పటికే పలుచోట్ల అవిశ్వాస తీర్మానాలు పెట్టారు. తాజాగా మంత్రి మల్లారెడ్డికి జవహర్ నగర్ కార్పొరేటర్లు షాకిచ్చారు. మేయర్ కావ్యపై కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. మేయర్ కావ్యకు వ్యతిరేకంగా 20 మంది కార్పొరేటర్లు ఓటేశారు. కొత్త మేయర్గా శాంతి కోటేష్ గౌడ్ ఎన్నికయ్యారు. కార్పొరేటర్లు త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది.
జవహర్ నగర్లో మొత్తం 28 వార్డులు ఉన్నాయి. అయితే ఓ కార్పొరేటర్ చనిపోవడంతో 27 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఎన్నికలకు ముందు నుంచే మేయర్ కావ్యపై 20మంది కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా మేయర్ కావ్య ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి వారిని గోవాకు తీసుకెళ్లి బుజ్జగించేందుకు ప్రయత్నించినా కార్పొరేటర్లు వినలేదు. దీంతో అవిశ్వాసం అనివార్యమైంది.