Home > తెలంగాణ > ప్యాకేజీల కోసం కాదు.. ప్ర‌జాసేవ కోస‌మే బీఆర్ఎస్‌లోకి ఆర్ఎస్పీ కామెంట్స్

ప్యాకేజీల కోసం కాదు.. ప్ర‌జాసేవ కోస‌మే బీఆర్ఎస్‌లోకి ఆర్ఎస్పీ కామెంట్స్

ప్యాకేజీల కోసం కాదు.. ప్ర‌జాసేవ కోస‌మే బీఆర్ఎస్‌లోకి ఆర్ఎస్పీ కామెంట్స్
X

తెలంగాణలో ఉద్యమనేత కేసీఆర్ నాయకత్వంలో పని చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. నేడు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. తనను చాలా మంది విమర్మిస్తున్నారని తాను ఎటువంటి ప్యాకేజీలకు లొంగేవాడినికాదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పోస్ట్ ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవమే స్పష్టం చేశారు. కానీ ఆ ఆఫర్‌ను తిరస్కరించానని తెలిపారు. ఎవరు ఎక్కడైనా పని చేసుకునే స్వేచ్ఛ ఉందన్నారు. మీరు గేట్లు తెరిస్తే చేరుతున్న గొర్రెల మందలో ఒక్కన్ని కాలేనని.. ప్యాకేజీ తీసుకునేటోన్నైతే రేవంత్‌తో కలిసేవానన్నీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రత్యేక పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని.. తెలంగాణవాదం, బహుజనవాదం ఒక్కటేనని అన్నారు. తాను ఏదీ ఆశించి బీఆర్ఎస్ పార్టీలోకి రాలేదని‌‌‌.. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్యామ్యం కోసమే వచ్చానని స్పష్టం చేశారు. నన్ను నమ్మి నాతో ప్రయాణిస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. చితికిపోయిన తెలంగాణకు కేసీఆర్ విముక్తి కల్పించారని అన్నారు. నేడు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న ఆర్ఎస్పీ తెలంగాణ భవన్ నుండి భారీ ర్యాలీగా వెళ్లి.. ఫామ్ హౌజ్‌లో మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో జాయిన్ కానున్నారు.

Updated : 18 March 2024 4:46 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top