Home > తెలంగాణ > కేటీఆర్, హరీశ్ రావులకు చేదు అనుభవం.. బస్సుపై కోడిగుడ్లతో దాడి

కేటీఆర్, హరీశ్ రావులకు చేదు అనుభవం.. బస్సుపై కోడిగుడ్లతో దాడి

కేటీఆర్, హరీశ్ రావులకు చేదు అనుభవం.. బస్సుపై కోడిగుడ్లతో దాడి
X

నల్గొండ టూర్ కు వెళ్తున్న కేటీఆర్, హరీశ్ రావులకు చేదు అనుభవం ఎదురైంది. పార్టీ నేతలతో కలిసి బస్సులో వెళ్తుండగా.. NSUI కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. బస్సుపై కోడిగుడ్లు విసిరి.. కేటీఆర్, హరీశ్ రావు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నల్ల చొక్కాలు ధరించి బస్సుకు అడ్డుపడ్డారు. నిరసన తెలుపుతున్న NSUI కార్యకర్తలను అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి దాడి జరగకుండా చూసుకున్నారు. బీఆర్ఎస్ నేతల బస్సుకు సెక్యూరిటీ కల్పించి.. సభాస్థలికి తీసుకెళ్లారు.

Updated : 13 Feb 2024 4:50 PM IST
Tags:    
Next Story
Share it
Top