Home > తెలంగాణ > చాపకింద నీరులా విస్తరిస్తోన్న జేఎన్‌.1 సబ్వేరియంట్.. ఆ రెండు రాష్ట్రాల్లోనే 112 కేసులు

చాపకింద నీరులా విస్తరిస్తోన్న జేఎన్‌.1 సబ్వేరియంట్.. ఆ రెండు రాష్ట్రాల్లోనే 112 కేసులు

చాపకింద నీరులా విస్తరిస్తోన్న జేఎన్‌.1 సబ్వేరియంట్.. ఆ రెండు రాష్ట్రాల్లోనే 112 కేసులు
X

దేశంలో కొవిడ్ 19 సబ్ వేరియంట్ జేఎన్.1 వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ కేసుల బారిన పడినవారి సంఖ్య 157కు చేరింది. ఒక్క కేరళలోనే అత్యధికంగా 78, గుజరాత్ లో 34 కేసులు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం ప్రకటించింది. కేరళ, గుజరాత్ కాకుండా ఇంకా ఏడు రాష్ట్రాల్లో జేఎన్.1 కేసులు పెరుగుతున్నాయి. గోవా 18, కర్ణాటక 8, మహారాష్ట్ర 7, రాజస్థాన్‌ 5, తమిళనాడు 4, తెలంగాణ 2, ఢిల్లీ 1 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అన్ని కొవిడ్ పాజిటివ్ కేసులకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని అధికారులను ఆదేశించింది.

దాని ద్వారా కొత్త వేరియంట్ కేసులను నిర్ధారించొచ్చని అనుకుంటోంది. BA.2.86 రకానికి చెందిన ఈ జేఎన్‌.1 సబ్ వేరియంట్ ప్రత్యేకమైన ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా డబ్ల్యూహెచ్ వో (WHO) తెలిపింది. ఈ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉన్నా.. ముంపు తక్కువేనని స్పష్టం చేసింది. దేశంలో కొత్త వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నా.. ప్రజలు ఏ మాత్రం భయపడాల్సిన పనిలేదని కేంద్ర ప్రభుత్వం సూచించింది.


Updated : 28 Dec 2023 4:27 PM GMT
Tags:    
Next Story
Share it
Top