Home > తెలంగాణ > Traffic challans : ఇప్పటివరకు ట్రాఫిక్ పెడింగ్ చలాన్ల ఆదాయం ఎంతో తెలుసా..!

Traffic challans : ఇప్పటివరకు ట్రాఫిక్ పెడింగ్ చలాన్ల ఆదాయం ఎంతో తెలుసా..!

Traffic challans  : ఇప్పటివరకు ట్రాఫిక్ పెడింగ్ చలాన్ల ఆదాయం ఎంతో తెలుసా..!
X

తెలంగాణలో పెడింగ్ ట్రాఫిక్ చలాన్ల ఆఫర్ ప్రభుత్వానికి కోట్లు కురిపిస్తోంది. ఇప్పటివరకు పెండింగ్ చలాన్ల రాయితీతో ప్రభుత్వానికి రూ.135 కోట్ల ఆదాయం సమకూరిందంటే..ఏ మేర స్పందన వచ్చిందో అర్థం చేసుకొవచ్చు. రాష్ర్టంలో మొత్తం రూ.1.50 కోట్ల చలాన్ల చెల్లింపులు జరగగా రూ.135 కోట్లు ఆదాయం వచ్చింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.34 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.25 కోట్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో రూ.16 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పెండింగ్ చలాన్లు రూ.3.59 కోట్లు ఉండగా... 42.38 శాతం చలాన్లకు మాత్రమే చెల్లింపులు జరిగాయని పోలీసులు తెలిపారు. అంటే దాదాపు 1.50 కోట్ల చలాన్ల చెల్లింపులు జరిగాయనమాట. అటు గత నెల పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. ఆటో, బైక్ వాహనాలపై 80 శాతం, కార్లు, జీపులపై 60 శాతం, తోపుడు బండ్లు వంటి వాటి మీద 90 శాతం, ఆర్టీసీ బస్సులపై 90 శాతం డిస్కౌంట్ ఇచ్చారు. దీంతో చలాన్లను కట్టేందుకు వాహనాదారులు మొగ్గు చూపుతున్నారు. కాగా పెడింగ్ చలాన్ల రాయితీ ఈ నెలాఖరుతో ముగియనుంది.




Updated : 27 Jan 2024 12:05 PM GMT
Tags:    
Next Story
Share it
Top