Home > తెలంగాణ > జీఎస్టీ స్కామ్.. దేశంలో 2600 బోగస్ కంపెనీలు

జీఎస్టీ స్కామ్.. దేశంలో 2600 బోగస్ కంపెనీలు

జీఎస్టీ స్కామ్.. దేశంలో 2600 బోగస్ కంపెనీలు
X

జీఎస్టీ స్కామ్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 2,600 బోగస్ కంపెనీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ లో పెద్ద మాఫియా నడుస్తున్నట్లు గుర్తించారు. ఒక్క హైదరాబాద్ లోనే 326కి పైగా బోగస్ కంపెనీలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఢిల్లీ కేంద్రంగా రూ. 10వేల కోట్లకు పైగా స్కామ్ జరిగింది. ఈ స్కామర్లు ఇతరుల ఆధార్, పాన్ కార్డ్స్ తో జీఎస్టీ సర్టిఫికెట్ల తయారుచేస్తున్నారని.. ఎలాంటి స్టాక్ లేకుండానే రాత్రికి రాత్రి బోగస్ గోదాములు సృష్టి స్కామ్ లకు పాల్పడుతున్నారని అధికారులు చెప్పుకొచ్చారు. ఆ అడ్రస్ తో డీలర్ 4శాతం నుంచి 6 శాతం మేర జీఎస్టీ చెల్లిస్తున్నట్లు బిల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆ తర్వాత కొంతమంది వ్యాపారులకు 15శాతం నుంచి 18 శాతం మేర స్టాక్ కొన్నట్లు రిటైలర్ల చేతికి బిల్స్ ఇస్తున్నారు. కొన్ని నెలలుగా ఆ స్కామ్ పై నిఘా పెట్టి అధికారులు.. రెడ్ హ్యండెడ్ గా నిందితులను పట్టుకున్నారు.

Updated : 6 July 2023 12:07 PM IST
Tags:    
Next Story
Share it
Top