Home > తెలంగాణ > TS TET exam: టెట్ ఎగ్జామ్లో ఘోర తప్పిదం.. ఒక పేపర్ బదులు మరో పేపర్ ఇవ్వడంతో..

TS TET exam: టెట్ ఎగ్జామ్లో ఘోర తప్పిదం.. ఒక పేపర్ బదులు మరో పేపర్ ఇవ్వడంతో..

TS TET exam: టెట్ ఎగ్జామ్లో ఘోర తప్పిదం.. ఒక పేపర్ బదులు మరో పేపర్ ఇవ్వడంతో..
X

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన టెట్ ఎగ్జామ్ వల్ల గందరగోళం నెలకొంది. ఎగ్జామ్ నిర్వహించిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక క్వశ్చన్ పేపర్ కు బదులుగా మరో పేపర్ అందజేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 సెంటర్లలో ఒక క్వశ్చన్ పేపర్ బదులు మరో క్వశ్చన్ పేపర్ ను అందిచారు. అయితే ఆ విషయం తెలియక అభ్యర్థులు దాదాపు అరగంట పాటు అదే పేపర్ తో పరీక్ష రాశారు. అనంతరం తమ తప్పు తెలుసుకున్న అధికారులు.. పేపర్ పై వైట్నర్ రాయాలని అభ్యర్తులకు సూచించారు.

అప్పటికే దాదాపు సగం మంది 30కి పైగా సమాధానాలు పెట్టేశారు. తప్పు తెలుసుకున్న అధికారులు ఆన్సర్ ఇచ్చిన వాటిని వైట్నర్ తో రబ్ చేయాలని సూచించగా.. అలా చేస్తే ఆన్సర్ షీట్ వ్యాలిడ్ కాదంటూ అభ్యర్థులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సాయంత్రం 5 గంటలకు ముగియాల్సిన పరీక్ష.. 6 గంటల వరకు జరిగింది. ఆయా సెంటర్లలో పరీక్ష రాయడానికి సమయం పెంచారు. అయితే తమకు అన్యాయం జరిగిందని, ఆన్సర్ షీట్ వ్యాలిడ్ కాకపోతే ఎలా అంటూ టెట్ అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్ల ముందు వాగ్వాదానికి దిగారు.




Updated : 15 Sept 2023 10:49 PM IST
Tags:    
Next Story
Share it
Top