Home > తెలంగాణ > కలెక్టర్‌లు సిద్ధంగా ఉండాలని.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం

కలెక్టర్‌లు సిద్ధంగా ఉండాలని.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం

కలెక్టర్‌లు సిద్ధంగా ఉండాలని.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. 21న జరగబోయే సమావేశానికి అంతా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కొత్త రేషన్ కార్డులు, మహాలక్ష్మి పథకం అమలు, భూరికార్డుల సమస్యలు, కౌలుదారుల గుర్తింపు సహా మరికొన్ని అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక కలెక్టర్లతో రేవంత్ తొలిసారి సమావేశం నిర్వహిస్తుండటంతో.. ప్రభుత్వ పాలసీలపై చర్చించే అవకాశం ఉంది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వారం రోజులు గడుస్తుండటంతో.. వివిధ శాఖల్లోని వాస్తవ పరిస్థితులపై సీఎం ఓ అంచనాకు వచ్చారు. ఇక హామీల అమలుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే రేవంత్ రెడ్డి.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకు బీమా అమలు పరిచిన విషయం తెలిసిందే. మిగతా హామీల దిశగా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

Updated : 17 Dec 2023 8:03 PM IST
Tags:    
Next Story
Share it
Top