Home > తెలంగాణ > హైదరాబాద్ కు మరో వందే భారత్ రైలు

హైదరాబాద్ కు మరో వందే భారత్ రైలు

హైదరాబాద్ కు మరో వందే భారత్ రైలు
X

ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్ళు హైదరాబాద్ నుంచి తిరుగుతున్నాయి. ఇప్పుడు మరొకటి యాడ్ అవుతోంది. ఐటీ హబ్ లుగా పేరుగాంచిన బెంగళూరు, హైదరాబాద్ మధ్య కొత్త రైలు పరుగులు పెట్టనుంది. ఈ నెలలోనే 6 లేదా 15 నుంచి ఈ రైలు తిరగడం మొదలవచ్చు అని తెలుస్తోంది.

దక్షిణ మధ్య రైల్వేకు మరో వందే భారత్ రైలు వస్తోంది. ఆల్రెడీ చెన్నై కోచ్ ఫ్యాక్టరీ నుంచి కొత్త ట్రైన్ కాచిగూడ స్టేషన్ కు చేరుకుందని సమాచారం. కాచిగూడ-యశ్వంత్ పూర్ స్టేషన్ల మధ్య ఈ సెమీ బుల్లెట్ ట్రైన్ తిరగనుంది. దీంతో దక్షిణ మధ్య రైల్వేకు మూడో వందే భారత్ సర్వీస్ అవుతుంది. దీనిని ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. దీంతో హైదరాబాద్-బెంగళూరు మధ్య 11ల ప్రయాణ దూరం కేవలం 8 గంటల్లోనే పూర్తవుతుంది.

కాచిగూడలో ఉదయం 6గంటలకు బయలుదేరి బెంగళూరుకు మధ్యాహ్నం 2గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుంచి మళ్ళీ 3 గంటలకు బయలుదేరి రాత్రి పదకొండు గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. దీంతో ఒకే రోజులో రాకపోకలు అయిపోతాయి. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ నుంచి మొదటి వందే భారత్ ట్రైన్ జనవరిలో ప్రారంభం అయింది. ప్రస్తుతం సికింద్రాబాద్- వైజాగ్ ల మధ్య ఒకటి, సికింద్రాబాద్-తిరుపతిల మధ్య మరొకటి వందే భారత్ రైళ్ళు తిరుగుతున్నాయి.



Updated : 2 Aug 2023 12:14 PM IST
Tags:    
Next Story
Share it
Top