Home > తెలంగాణ > అదే ఇంటికి వెళ్ళనున్న రాహుల్ గాంధీ

అదే ఇంటికి వెళ్ళనున్న రాహుల్ గాంధీ

అదే ఇంటికి వెళ్ళనున్న రాహుల్ గాంధీ
X

లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తరువాత రాహుల్ గాంధీ అదే ఇంటికి వెళతారా లేదా అనే చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయన ఖాళీ చేసిన ఇంటినే తిరిగి కేటాయించారని కాంగ్రెస్ వర్గాలు ఈరోజు ధృవీకరించాయి.

ఢిల్లీలోని 12-తుగ్లక్ లేన్ లోని అధికారిక బంగ్లానే లోక్ సభ హౌసింగ్ కమిటీ తిరిగి రాహుల్ గాంధీకి కేటాయించిందని చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. సరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ కు 2 ఏళ్ళ జైలుశిక్ష విధించింది. అప్పుడు లోక్ సభ కూడా ఆయన మీద అనర్హత వేటు వేసింది. దీంతో లాస్ట్ ఏప్రిల్ లో రాహుల్ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసి 10 జన్ పథ్ లోని తన తల్లి సోనియా గాంధీ నివాసానికి వెళ్ళిపోయారు. తాజాగా రాహుల్ మీద అనర్హత వేటు తొలిగిపోవడంతో తిరిగి అదే బంగ్లాను ఆయనకు కేటాయించినట్లు తెలుస్తోంది.





2005 నుంచి ఏప్రిల్ లో ఖాళీ చేసేంతవరకు రాహుల్ గాంధీ 12 తుగ్లక్ లేన్ లోనే ఉన్నారు. అయితే ఇప్పుడు రాహుల్ మళ్ళీ ఆ ఇంటికి తిరిగి వెళతారా లేదా తన తల్లితో పాటూ 10జనపథ్ లోనే ఉంటారా అనే దాని మీద మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. దీని గురించి అడిగితే మాత్రం రాహుల్...కేవలం అదొక్కటే కాదని...భారత్ మొత్తం తన ఇల్లే అంటూ స్పందించారు.





Updated : 8 Aug 2023 6:05 PM IST
Tags:    
Next Story
Share it
Top