Home > తెలంగాణ > Medaram : మేడారం వెళ్లలేకపోతున్నారా..? ఆన్లైన్లో మొక్కు చెల్లించండి..

Medaram : మేడారం వెళ్లలేకపోతున్నారా..? ఆన్లైన్లో మొక్కు చెల్లించండి..

Medaram : మేడారం వెళ్లలేకపోతున్నారా..? ఆన్లైన్లో మొక్కు చెల్లించండి..
X

మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సమ్మక్క సారలమ్మ దర్శనానికి స్వయంగా వెళ్లి బంగారం సమర్పించలేని భక్తులకు కొత్త అవకాశం కల్పించింది. ఆన్లైన్ ద్వారా మొక్కులు చెల్లించే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. భక్తులు వారి బరువు ప్రకారం బెల్లం కొనుగోలు చేసి బంగారం సమర్పణ సేవ బుక్ చేసుకోవచ్చని చెప్పింది. ఈ సర్వీసును మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు.

కిలో బెల్లం రూ. 60 చొప్పున చెల్లించి వ్యక్తులు తమ బరువుకు తగ్గట్లుగా బంగారం కొనుగోలు చేసేందుకు వీలు కలుగుతుంది. మీసేవ, పోస్టాఫీస్, టీయాప్ ఫోలియా ద్వారా ఈ సర్వీసులు బుక్ చేసుకునే ఛాన్సుంది. అంతేకాదు.. పోస్టాఫీసు ద్వారా మేడారం ప్రసాదం కూడా పొందే అవకాశం కల్పిస్తున్నారు.

దేశంలో కుంభమేళా తర్వాత అత్యంత జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. రెండేండ్లకోసారి మాఘ మాసంలో నాలుగు రోజుల పాటు కన్నుల పండువగా జరుగుతుంది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా గిరిజనులు ఈ జాతరకు హాజరై మొక్కులు చెల్లించుకుంటారు. మొక్కులు తీరినవారు అమ్మవార్లకు బెల్లాన్ని బంగారంగా సమర్పిస్తారు.

Updated : 7 Feb 2024 1:26 PM GMT
Tags:    
Next Story
Share it
Top