Home > తెలంగాణ > ప్రజా పాలనకు ఇంకా రెండ్రోజులే గడువు.. ప్రభుత్వం ఏం చెప్పిందంటే..?

ప్రజా పాలనకు ఇంకా రెండ్రోజులే గడువు.. ప్రభుత్వం ఏం చెప్పిందంటే..?

ప్రజా పాలనకు ఇంకా రెండ్రోజులే గడువు.. ప్రభుత్వం ఏం చెప్పిందంటే..?
X

తెలంగాణలో ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతోంది. డిసెంబర్ 28న మొదలైన ఈ ప్రోగ్రాం జనవరి 6 వరకు సాగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 17లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమం మరో రెండు రోజుల్లో ముగియనుంది. దీంతో చాలా మంది ఆందోళనకు గురవుతున్నాయి. ఇప్పటికే కొన్ని లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా.. ఇంకా దరఖాస్తు చేసుకోనివాళ్లు లక్షల్లోనే ఉన్నారు. గడువు సమీపిస్తుండడంతో వారంతా టెన్షన్ పడుతున్నారు.

ప్రజాపాలనకు టైం దగ్గరపడుతుండడంతో జనం సెంటర్లకు పోటెత్తుతున్నారు. ఇప్పుడు అప్లయ్ చేసుకోకపోతే పథకాలు అందవనే ఆందోళనతో ప్రోగ్రాం కౌంటర్లకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. నాలుగు నెలలకు ఓసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపింది. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందలనేది ప్రభుత్వ లక్ష్యమని.. ప్రజలు ఆందోళనకు గురికావొద్దని చెప్పారు. అదేవిధంగా ఈ కార్యక్రమం అమలులో ఎటువంటి లోటు పాట్లు లేకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.

మరోవైపు ఈ నెల 6 నుండి 17 వరకు ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను డేటా ఎంట్రీ చేయనున్నారు. ఈ నెల 17 లోపు అన్ని అప్లికేషన్ల డేటా ఎంట్రీ కంప్లీట్ చేయాలని అధికారులను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. మండల కేంద్రాల్లోనూ డేటా ఎంట్రీ ప్రక్రియ చేపడతామన్నారు. అప్లికేషన్ల డేటా ఎంట్రీపై రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి సిబ్బందికి ట్రైనింగ్ సైతం ఇస్తున్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డులను ప్రామాణికంగా పరిగణించాలని ఇప్పటికే అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.


Updated : 4 Jan 2024 4:07 PM IST
Tags:    
Next Story
Share it
Top