TS Assembly : కేసీఆర్ నిర్ణయాలతో విపక్షాల గొంతు మూగబోయింది : Harish Rao
X
సీఎం కేసీఆర్ నిర్ణయాలతో విపక్షాలకు దిక్కుతోచడం లేదని Harish Rao అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పోడుభూముల పంపిణీ, వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ, రైతు రుణమాఫీ నిర్ణయాలతో ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ తగిలిందని చెప్పారు. కీలక నిర్ణయాల వల్ల ప్రతిపక్షాలకు ఏంమాట్లాడాలో తెలియడం లేదన్న మంత్రి.. దెబ్బ మీద దెబ్బ కొట్టడంతో విపక్షాలు తట్టుకోవడం లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో లాబీలో మంత్రి చిట్ చాట్ నిర్వహించారు.
KCR నిర్ణయాలతో విపక్షాల గొంతు మూగబోయిందని హరీష్ రావు విమర్శించారు. అసెంబ్లీలో విపక్షాలను సమర్థంగా ఎదుర్కొంటామని చెప్పారు. ఇక కాంగ్రెస్, బీజేపీల వద్ద డబుల్ బెడ్ రూమ్ అంశం తప్ప మరో అంశం లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కొంతమండి మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. త్వరలోనే మీడియా సంస్థ ప్రారంభిస్తానని చెప్పారు. అదేవిధంగా తెలంగాణ యాసలో ఏడాదికి నాలుగు సినిమాలు తీస్తానని వివరించారు.
శాసనసభ రేపటికి వాయిదా
కాగా Telangana assembly Monsoon Sessions ప్రారంభమయ్యాయి. తొలి రోజున కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు శాసనసభ నివాళి అర్పించింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ అభివృద్ధికి సాయన్న ఎంతో కృషి చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయనతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని, నిత్యం ప్రజలతో మమేకమై నిరాబండబరంగా ఉండేవారని గుర్తు చేశారు. అట్టడుగు వర్గం నుంచి వచ్చిన వచ్చిన సాయన్న మన మధ్య లేకపోవడం బాధాకరమని కేసీఆర్ అన్నారు.