Home > తెలంగాణ > ఓయూ పరిధిలో.. ఆ తేదీల్లో జరిగే అన్ని పరీక్షలు వాయిదా

ఓయూ పరిధిలో.. ఆ తేదీల్లో జరిగే అన్ని పరీక్షలు వాయిదా

ఓయూ పరిధిలో.. ఆ తేదీల్లో జరిగే అన్ని పరీక్షలు వాయిదా
X

ఈ నెల 20న ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు బోర్డ్ ప్రకటించింది. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం 20 రోజుల పాటు అవతరణ దినోత్సవాలు జరుపుతున్న విషయం తెలిసింది. అందులో భాగంగానే జూన్ 20న ప్రభుత్వం ఎడ్యుకేషన్ డే నిర్వహిస్తోంది. అంతేకాకుండా ఆ రోజు అన్ని స్కూల్లకు సెలవులు ప్రకటించింది. ఈ సందర్భంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ ఎగ్జామ్స్ ​కంట్రోలర్​ ప్రొఫెసర్ ​రాములు ఒక ప్రకటనలో తెలిపారు. వాయిదా పడ్డ పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. పరీక్షలు వాయిదా పడ్డ విషయాన్ని విద్యార్థులు గమనించి, సహకరించాలని కోరారు.

Updated : 18 Jun 2023 9:49 AM IST
Tags:    
Next Story
Share it
Top