Home > తెలంగాణ > ఉస్మానియా రణరంగం ..ఈ వీసీ మాకొద్దు

ఉస్మానియా రణరంగం ..ఈ వీసీ మాకొద్దు

ఉస్మానియా రణరంగం ..ఈ వీసీ మాకొద్దు
X

ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైస్ ఛాన్సరల్ ప్రొఫెసర్ రవీందర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థులు రోడ్డుక్కారు. యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద భారీ సంఖ్యలో గుమికూడి ఆందోళన చేశారు. పరిపాలన భవనం వద్ద ఉన్న ముళ్లకంచెలను తొలగించాలని డిమాండ్ చేశారు. వీసీ రవీందర్ విద్యార్థి వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాడని, ఆయన తీరుతో తమ జీవితాలు నాశనం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవీందర్ నియంతృత్వానికి చరమగీతం పాడతాడమని హెచ్చరించారు. పరిపాలన భవనంలోకి దూసుకెళ్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలిస్తున్నారు.

Updated : 14 Dec 2023 1:33 PM IST
Tags:    
Next Story
Share it
Top