Home > తెలంగాణ > Otan Account Budget : అసెంబ్లీలో నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్

Otan Account Budget : అసెంబ్లీలో నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్

Otan Account Budget  : అసెంబ్లీలో నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్
X

(Otan Account Budget) నేడు అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి శ్రీదర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. తొలుత ఉదయం 9 గంటలకు అసెంబ్లీ హాల్ నెంబర్‌-1లో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఓట్ ఆన్ బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. ప్రస్తుత ఏడాది(2023-24)కి సంబంధించి 2023 ఫిబ్రవరిలో రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అయితే, నిర్దేశిత లక్ష్యాల మేరకు ఆదాయాలు రాకపోవడంతో సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.2.50 లక్షల కోట్ల వరకు ఉంటుందని టాక్. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదికి ‘వాస్తవిక(రియలిస్టిక్‌) అంచనా’లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని ఆర్థికశాఖకు నూతన సర్కార్ సూచించింది. వచ్చే ఏడాది(2024-25)కి బడ్జెట్‌ అంచనా రూ.2.95 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకూ ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కొత్త ప్రభుత్వ ప్రాథమ్యాల ప్రకారం.. అత్యధికంగా సంక్షేమ రంగానికి రూ.40 వేల కోట్లు, వ్యవసాయానికి రూ.30 వేల కోట్లు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖకు రూ.30 వేల కోట్లు, సాగునీటి పారుదలకు రూ.29 వేల కోట్లు, విద్యుత్‌ శాఖకు రూ.18 వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండొచ్చని తెలుస్తోంది. కేంద్రం గ్రాంట్లు తక్కువగా రావడం వంటి కారణాల వల్ల సవరించిన బడ్జెట్‌ అంచనాలు రూ.2.90 లక్షల కోట్ల నుంచి రూ.2.50 లక్షల కోట్లకు తగ్గవచ్చని తెలుస్తోంది. దీన్నిబట్టే కొత్త బడ్జెట్‌ అంచనాలను రూపొందించారు. ఈ ఏడాది సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగాల తగ్గుదల వంటి కారణాల వల్ల సేవల రంగంలో వృద్ధి రేటు తగ్గవచ్చని అంచనా. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటు గతేడాది 16.3% నమోదవగా.. ఈ ఏడాది 11% నుంచి 12% వరకు ఉండే ఛాన్స్ ఉంది. తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఆరు గ్యారంటీలకు తొలి ప్రాధాన్యమివ్వనున్నారు. వీటి అమలుకు వచ్చే ఏడాది దాదాపు రూ.60 వేల కోట్లకు పైగా అవసరమని అంచనా. ఈ కారణంగానే విద్యుత్‌, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు కేటాయింపులు భారీగా పెరగనున్నాయి. ఉదాహరణకు మహాలక్ష్మి పధకం కింద మహిళలకు ప్రతినెలా రూ.2500’ పథకం అమలుకే రూ.20 వేల కోట్లను సంబంధిత శాఖ అడిగినట్లు తెలుస్తోంది. నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటుకు రూ.4,200 కోట్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి రూ.5 వేల కోట్లు.. ఇలా ప్రతి హామీకి భారీగా నిధులు కావాలని ఆయా ప్రభుత్వ శాఖలు కోరినట్లు తెలుస్తొంది.




Updated : 10 Feb 2024 1:49 AM GMT
Tags:    
Next Story
Share it
Top