OU పరిధిలో ఇవాళ, రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా
వర్షాల కారణంగా పరీక్షలు వాయిదా
X
తెలంగాణలో భారీ భారీ వర్షాలు కురుస్తున్నందున విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఇవాళ, రేపు సెలవులు ప్రకటించారు. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించడంతో ఇవాళ, రేపు జరగాల్సిన పరీక్షలన్నింటిని వాయిదా వేస్తున్నామని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రకటించారు. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలన త్వరలో వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తామని తెలిపారు.
ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అన్ని విద్యా సంస్థలకు2 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇవాళ, రేపు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. పరిస్థితిని బట్టి ఎల్లుండి కూడా సెలవు ఇచ్చే అవకాశముంది. రాష్ట్రానికి భారీ వర్షం ముప్పు ఉందని హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఇవాళ, రేపు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.