సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావ్ గౌడ్
X
లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో గెలిచే గుర్రాలను ఎంపిక చేస్తూ వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసింది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పద్మారావు గౌడ్ ను అభ్యర్థిగా గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు.
1991 వరకు కార్పొరేటర్‌గా పనిచేసిన పద్మారావుగౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2001లో అప్పటి టీఆర్ఎస్ లో చేరారు. పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేస్తూ 2002లో గులాబీ పార్టీ తరపున కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పద్మారావుగౌడ్ సనత్‌నగర్ నియోజకవర్గంలో పోటీచేసి.. కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక 2014 ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా విజయకేతనాన్ని ఎగరవేశారు. మంత్రిగానూ తన బాధ్యతను నిర్వర్తించారు. 2018 ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ స్పీకర్ గా పదవీ బాధ్యతను స్వీకరించారు. అనంతరం 2023లో బీఆర్ఎస్ తరపున సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.