Home > తెలంగాణ > పాలమూరు ప్రజల దశాబ్దాల కల.. రేపు సాకారం కానుంది

పాలమూరు ప్రజల దశాబ్దాల కల.. రేపు సాకారం కానుంది

పాలమూరు ప్రజల దశాబ్దాల కల.. రేపు సాకారం కానుంది
X

పాలమూరులో బీడువారిన పొలాలను, తడారిన పల్లె గొంతులను కృష్ణమ్మ తడుపబోతోంది. అక్కడి ప్రజల దశాబ్దాల కల సాకారం కాబోతోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శనివారం (సెప్టెంబర్ 16) ఎత్తిపోతల పథకం ప్రారంభం కానుంది. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ ఉదయ్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. పర్యటనలో భాగంగా కేసీఆర్.. మధ్యాహ్నం నార్లపూర్ వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం వద్ద కంప్యూటర్ ద్వారా స్విచ్ ఆన్ చేసి, తర్వాత ఇంటెక్ వద్ద కృష్ణా జలాలకు పూజరుపుతారు.

పూజా కార్యక్రమం అనంతరం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీలకు కలశాల ద్వారా కృష్ణా జలాలు అందిస్తారు. ఆ జలాలతో గ్రామ దేవతల కాళ్లు కడిగి అభిషేకం చేయాలని సూచించారు. అనంతరం సింగోటం చౌరాస్తా వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. ఈ స్పీచ్ నంతా సభా స్థలివద్ద భారీ స్కోన్ లను ఏర్పాటుచేసి ప్రజలకు చూపిస్తారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసేందుకు తాగునీరు, కూర్చోడానికి కుర్చీలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.




Updated : 15 Sep 2023 4:46 PM GMT
Tags:    
Next Story
Share it
Top