కాంగ్రెస్లో మునుగోడు పంచాయతీ.. గాంధీ భవన్ వద్ద ఆందోళన..
X
కాంగ్రెస్లో మునుగోడు పంచాయతీ చర్చనీయాంంగా మారింది. గాంధీ భవన్లో మునుగోడు నియోజకవర్గానికి చెందిన నేతలు ఆందోళనకు దిగారు. మండల కమిటీల నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని పాల్వాయి స్రవంతి వర్గం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో తన వర్గానికి చెందిన నేతలతో స్రవంతి గాంధీభవన్కు వెళ్లారు. టీపీసీసీ చీఫ్ క్యాబిన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆమె అనుచరులను సిబ్బంది అడ్డుకున్నారు.
స్రవంతిని మాత్రమే లోపలికి అనుతించడతో నేతలు ఆందోళనకు దిగారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మండల కమిటీల అధ్యక్షుల నియామకంలో చలిమెల కృష్ణారెడ్డి వర్గానికే ప్రాధాన్యత ఇచ్చారని పాల్వాయి స్రవంతి ఆరోపించారు. మండల కమిటీల్లో తమ వర్గానికి చెందిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలా పనిచేయాలని ఆమె ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని, ఆమె అనుచరులను గాంధీ భవన్లోకి రాకుండా అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది. pic.twitter.com/Hekes1GpII
— Telugu Scribe (@TeluguScribe) July 6, 2023
కాగా మునుగోడు ఉపఎన్నికలో స్రవంతి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి.. ఓడిపోయారు. అప్పుడు చలిమెల కృష్ణారెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశించినా.. కానీ సీనియర్లు స్రవంతి వైపు మొగ్గు చూపడంతో పార్టీ ఆమెకు టిక్కెట్ కేటాయించింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. ఇక రానున్న ఎన్నికల కోసం చలిమెల కృష్ణారెడ్డి సైతం టిక్కెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధిష్టానం ఎవరికి టిక్కెట్ కేటాయిస్తుందనేది వేచి చూడాలి.