Home > తెలంగాణ > Suspended:మాజీ MLA కొడుకు కేసు.. పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ సస్పెండ్

Suspended:మాజీ MLA కొడుకు కేసు.. పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ సస్పెండ్

Suspended:మాజీ MLA కొడుకు కేసు.. పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ సస్పెండ్
X

హైదరాబాద్‌లోని బేగంపేట ప్రజాభవన్‌ వద్ద మాజీ ఎమ్మెల్యే కొడుకు రాష్ డ్రైవింగ్ తో ట్రాఫిక్‌ బారికేడ్లను కారుతో ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన సోహైల్‌ను కేసు నుంచి తప్పించారన్న ఆరోపణలతో ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావుపై వేటు పడింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహైల్‌ను అరెస్టు చేయకుండా.. అతడి ఇంట్లో డ్రైవర్‌గా పని చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని, డ్రైవింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని దుర్గారావుపై అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వెస్ట్ జోన్ డీసీపీ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. అనంతరం, మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సొహైల్‌పై కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తే.. ప్రమాదం జరిగినప్పుడు కారును సోహైల్ నడుపుతున్నట్టుగా కనిపించాడు. దీంతో సీఐ తన బాధ్యతల్లో అలక్ష్యంగా వ్యవహరించాడని అధికారులు ఫైర్ అయ్యారు. ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారులు పంజాగుట్ట CI దుర్గారావును సస్పెండ్ చేశారు.

కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షకీల్ కొడు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు దుబాయ్ కి పారిపోగా.. అతనిపై లుకౌట్ నోట్ జారీ చేశారు. ప్రమాదం తర్వాత సోహైల్‌ ​దుబాయ్‌లో ఉన్న తండ్రి షకీల్ వద్దకు వెళ్లినట్టు సమాచారం. అక్కడి నుంచే ఫోన్ల ద్వారా కేసును పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తుంది. మద్యం తాగి కారు డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణం అయిన సోహైల్‌పై ఎంవీ యాక్ట్ సెక్షన్ 184, ఐపీసీ 279 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

మియాపూర్ ఎస్సై కూడా..

ఇదిలా ఉండగా.. మరో ఇన్‌స్పెక్టర్‌పై కూడా సస్పెన్షన్‌ వేటు పడింది. మియాపూర్‌ సెక్టర్‌ SIగా పని చేస్తున్న ష్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ సైబరాబాద్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి మంగళవారం ఆదేశాలిచ్చారు. ఓ కేసులో బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించారన్న కారణంతో ఎస్సైపై వేటు వేశారు. ఓ కేసు విషయమై ఎస్సైకి ఫిర్యాదు చేసిన బాధితురాలిని... కేసు అప్పటికే ముగిసినప్పటికీ.. సదరు మహిళకు ఫోన్‌ చేసి, అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు సీపీకి నేరుగా ఫిర్యాదు చేయగా, పోలీసు విచారణలో అది నిజమని తేలింది. దీంతో ఎస్సైపై వేటు వేస్తూ సీపీ ఆదేశాలిచ్చారు.

Updated : 27 Dec 2023 7:21 AM IST
Tags:    
Next Story
Share it
Top