Home > తెలంగాణ > ఈ ఎన్నికలు ప్రత్యేకం.. బరిలో యవత, ట్రాన్స్జెండర్

ఈ ఎన్నికలు ప్రత్యేకం.. బరిలో యవత, ట్రాన్స్జెండర్

ఈ ఎన్నికలు ప్రత్యేకం.. బరిలో యవత, ట్రాన్స్జెండర్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యువత చక్రం తిప్పనుంది. యువ ఓటర్లే కాదు.. ఈసారి యూత్ కూడా ఎన్నికల బరిలో దిగుతుంది. ప్రధాన పార్టీ కొంతమంది యంగ్ స్టర్స్ కు అవకాశాలిచ్చాయి. అనూహ్యంగా టికెట్లు దక్కించుకున్ యువత.. చిన్న ఏజ్ లోనే ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే చట్టసభల్లో అడుగుపెట్టాలని ఉత్సాహంగా ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ ముందే బీఆర్ఎస్ పార్టీ 115 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తర్వాత అందులో కొన్ని మార్పులు చేసి కొత్తవారికి చోటిచ్చింది. అలా చోటుదక్కించుకున్న వారిలో ములుగు నియోజకవర్గంలోని బడే నాగజ్యోతి ఉన్నారు. 1994లో పుట్టిన నాగజ్యోతి 29 ఏళ్ల వయసులోనే ఎన్నికల బరిలో దిగుతుంది. కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న మృతిచెందడంతో.. ఆయన కూతురు లాస్య నందితకు (36 ఏళ్లు) కేసీఆర్ అవకాశం ఇచ్చారు. కోరుట్ల సిట్టింగ్ ఎమ్మెల్యే వయోభారం, అనారోగ్య సమస్యల వల్ల ఆయన కుమారుడు సంజయ్ కి కోరుట్ల టికెట్ దక్కింది. ఇల్లందు నుంచి పోటీ చేస్తున్న హరిప్రియ నాయక్ వయసు 38 ఏళ్లు. హుజురాబాద్ బరిలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి వయసు 40లోపే. నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ యాకత్ పురాకు వెళ్లగా.. నాంపల్ల టికెట్ ను ఎంఐఎం అభ్యర్థి మాజీద్ హుస్సేన్ కు కేటాయించారు. ఆయన వయసు 43 ఏళ్లే. ఎంఐఎం నుంచి పోటీ చేస్తున్న వారిలో ఇతనే యంగ్.

కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమంది యూవతకు చాన్స్ ఇచ్చింది. పాలకుర్తి బరిలో ఝాన్సీ రాజేందర్ రెడ్డి కోడలు యశస్వినికకి టికెట్ దక్కింది. ఈమె వయసు 27 ఏళ్లు మాత్రమే. నారాయణపేట టికెట్ దక్కించుకున్న డీకే అరుణ అన్న కూతురు పర్నిక చిట్టెం రెడ్డి వయసు కూడా 30 ఏళ్లలోపే. మెదక్ నుంచి పోటీ చేస్తున్న మైనంపల్లి రోహిత్ వయసు 30 లోపే. హుజురాబాద్ నుంచి పోటీ చేస్తున్న వోడితెల ప్రణవ్ బాబు ఏజ్ 30 ఏళ్లే. బీజేపీలోనూ యూత్ కు అవకాశం దక్కింది. జగిత్యాల నుంచి పోటీ చేస్తున్న బోగ శ్రావణి ఏజ్ 40లోపే. మహబూబ్ నగర్ బరిలో ఉన్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొడుకు మిథున్ రెడ్డి, నాగార్జున సాగర్ నుంచి పోటీ చేస్తున్న నివేదితా రెడ్డి, మహబూబాబాద్ నుంచి హుస్సేన్ నాయక్ లు, భూపాలపల్లి నుంచి టికెట్ దక్కించుకున్న కీర్తి రెడ్డి 40 ఏళ్ల లోపు వయసున్నవారే కావడం గమనార్హం. బీఎస్పీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా యువతకు అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా దేవరకొండ నుంచి వెంకటేశ్ చౌహాన్, పెద్దపల్లి నుంచి దాసరి ఉష, నకిరేకల్ నుంచి మేడి ప్రియదర్శినితో పాటు రెండు లిస్టుల్లో యూత్ కు కేటాయించారు. బీఎస్పీ మొత్తం అభ్యర్థుల్లో 30 మంది యువతే కావడం విశేషం. కాగా ఈ లిస్ట్ లో వరంగల్ ఈస్ట్ నుంచి ట్రాన్స్ జెండర్ మహిళను కూడా బరిలోకి దించింది బీఎస్పీ.

Updated : 16 Nov 2023 8:42 AM IST
Tags:    
Next Story
Share it
Top