Home > తెలంగాణ > రేపటి నుంచి ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. ఎందుకంటే..?

రేపటి నుంచి ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. ఎందుకంటే..?

రేపటి నుంచి ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. ఎందుకంటే..?
X

దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన జారీ చేసింది. పలు ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో మెయింటెనెన్స్, రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల జరుగుతున్నాయి. ఈ కారణంగా మొత్తం 22 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుని ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు ఎంచుకోవాలని కోరింది. రద్దైన 22 రైళ్లు జులై 17 నుంచి 22 వరకు అంటే దాదాపు వారం రోజుల పాటు రైళ్లు క్యాన్సిల్ అవుతాయి.

వీటిలో హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో 12 సర్వీసులు ఉన్నాయి. లింగంపల్లి-ఫలక్ నుమా మార్గంలో మరో 10 రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లు రద్దవుతాయి. ఈ రూట్లలో ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. మరోవైపు గుంటూరు డివిజన్ లో మెయింటెనెన్స్ పనుల కారణంగా పది ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.




Updated : 16 July 2023 7:33 AM GMT
Tags:    
Next Story
Share it
Top