Home > తెలంగాణ > బస్సుల్లో ఫ్రీ జర్నీ.. కండక్టర్, ప్యాసింజర్ల మధ్య ఐడీ ప్రూఫ్ గొడవ

బస్సుల్లో ఫ్రీ జర్నీ.. కండక్టర్, ప్యాసింజర్ల మధ్య ఐడీ ప్రూఫ్ గొడవ

బస్సుల్లో ఫ్రీ జర్నీ.. కండక్టర్, ప్యాసింజర్ల మధ్య ఐడీ ప్రూఫ్ గొడవ
X

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం పలుచోట్ల గొడవలకు దారి తీస్తోంది. మహిళా ప్రయాణికులు, కండక్టర్ల మధ్య వాగ్వాదానికి కారణమవుతోంది. స్కీం నిబంధనలు తెలియని మహిళలు కండక్టర్లతో గొడవకు దిగుతున్నారు. బస్సుల్లో ఫ్రీ జర్నీ చేయాలంటే ఒరిజినల్ ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్పోర్టుల్లో ఏదైనా ఒకటి కచ్చితంగా చూపించాలని నిబంధనలు ఉన్నాయి. అయితే వాటిని కొందరు బేఖాతరు చేస్తున్నారు. మరికొందరు తమ వద్ద గుర్తింపు కార్డులేదని అయినా ఫ్రీ జర్నీకి అనుమతించాలని అంటున్నారు. మరికొందరు ఫోన్లలో ఐడీ ప్రూఫ్ చూపుతుండటంతో కండక్టర్లు వారిని అనుమతించకపోవడంతో గొడవకు దిగుతున్నారు.

తాజాగా ఓ యువతి ఫోన్ లో ఆధార్ నెంబర్ చూపించడంతో కండక్టర్ ఫ్రీ జర్నీకి అనుమతించలేదు. ఆధార్ కార్డు చూపించాలని కోరడంతో సదరు యువతి గొడవకు దిగింది. ఒరిజినల్ ఆధార్, ఫోన్ లో ఉన్న ఆధార్ నెంబర్ ఒకటేకదా అని వితండవాదానికి దిగింది. తోటి ప్రయాణికులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. ఒరిజినల్ కార్డు చూపిస్తేనే జీరో టికెట్ ఇస్తానని కండక్టర్ చెప్పడంతో యువతి బస్సు దిగి వెళ్లిపోయింది.

Updated : 27 Dec 2023 12:59 PM IST
Tags:    
Next Story
Share it
Top