Home > తెలంగాణ > Neelam Madhu: బీఆర్ఎస్కు మరో షాక్.. బీసీ నేత రాజీనామా

Neelam Madhu: బీఆర్ఎస్కు మరో షాక్.. బీసీ నేత రాజీనామా

Neelam Madhu: బీఆర్ఎస్కు మరో షాక్.. బీసీ నేత రాజీనామా
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత.. కాంగ్రెస, బీఆర్ఎస్ పార్టీలకు వరస షాక్ లు తగులుతున్నాయి. అసంతృప్త నేతలు, టికెట్ ఆశించి నాయకులు ఒక్కరొక్కరుగా పార్టీలు వీడుతున్నారు. తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ముదిరాజ్ సంఘం రాష్ట్ర నేత, బీఆర్ఎస్ కీలక నేత నీలం మధు పార్టీని వీడారు. ఈరోజు ఉదయం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. చివరి క్షణం వరకు టికెట్ ఆశించిన నీలం మధు.. తనకు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బీఫామ్ ఇవ్వడంతో పార్టీని వీడినట్లు తెలుస్తుంది.

ఈమేరకు హైదరాబాద్ పటాన్ చెరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన నీలం మధు.. రాజీనామా చేయడానికి గల కారణాన్ని వివరించారు. అహంకారం కావాలా.. ఆత్మగౌరవం కావాలో పటాన్ చెరు ప్రజలు తేల్చుకోవాలని కోరారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఎన్నో విధాలుగా ప్రజలను ఇబ్బంలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ‘మీ బిడ్డనై బీఆర్ఎస్ కు రాజీనామా చేసి.. మీ వద్దకు వస్తున్నా. వచ్చే ఎన్నికల్లో ప్రజల మనిషిగా పోటీ చేస్తున్నా’ అని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ లో ముదిరాజ్ లకు సముచిత స్థానం దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 16 Oct 2023 8:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top