Home > తెలంగాణ > పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట విషాదం

పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట విషాదం

పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట విషాదం

పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట విషాదం
X




పటాన్ చెరు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పటాన్ చెరు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు మృతి చెందాడు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గత మూడు రోజుల క్రితం కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి… ఈ రోజు ఉదయం 2: 30 నిమిషాలకు మృతి చెందాడు. దీంతో పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి మృతి పట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు సంతాపం తెలుపుతున్నారు.

విష్ణువర్ధన్ రెడ్డి మృతితో ఎమ్మెల్యే కుటుంబం కన్నీటి పర్యంతం అవుతుంది. అందరితో కలిసి మెలిసి ఉంటూ ఆప్యాయంగా పలకరించే విష్ణు మరణవార్తతో సన్నిహితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆయన మరణవార్తతో పటాన్ చెరు ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయాలు అలుముకున్నాయి. మృతుడికి భార్య కిరణ్మయి తో పాటు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.


Updated : 27 July 2023 10:24 AM IST
Tags:    
Next Story
Share it
Top