Home > తెలంగాణ > కేబినెట్ విస్తరణపై సస్పెన్స్.. ఇంతకీ పట్నం ప్రమాణం ఎప్పుడు..?

కేబినెట్ విస్తరణపై సస్పెన్స్.. ఇంతకీ పట్నం ప్రమాణం ఎప్పుడు..?

కేబినెట్ విస్తరణపై సస్పెన్స్.. ఇంతకీ పట్నం ప్రమాణం ఎప్పుడు..?
X

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ కొనసాగుతోంది. బుధవారం ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రభుత్వం నుంచి ప్రకటించింది. అయితే అలాంటి సమాచారమేదీ రాజ్‌భవన్ నుంచి అందలేదని అందుకే ఏర్పాట్లు చేయలేదని అధికారులు అంటున్నారు. దీంతో పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడుచేస్తారన్నదానిపై సస్పెన్స్ నెలకొంది.

సోమవారం బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించిన సీఎం కేసీఆర్.. తాండూరు టికెట్‌ను పైలెట్‌ రోహిత్‌రెడ్డికి ఇస్తున్నట్లు చెప్పారు. అదే నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నేత పట్నం మహేందర్‌రెడ్డిని కేబినెట్లోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆగస్టు 23 ఉదయం 11.30లకు పట్నం ప్రమాణస్వీకారం ఉంటుందనే వార్తలు వచ్చాయి. అయితే ఉదయం 11.30 దాటినా రాజ్ భవన్లో ఎలాంటి హడావిడి కనిపించలేదు.

సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన నేపథ్యంలో కేబినెట్ విస్తరణ కార్యక్రమం వాయిదాపడిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గురు లేదా శుక్రవారం పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం ఉండొచ్చని సమాచారం. ఇదిలా ఉంటే పట్నంను మంత్రిమండలిలోకి తీసుకుంటున్నట్లు సీఎంఓ నుంచి రాజభవన్ కు సమాచారం అందినా గవర్నర్ అందుబాటులో లేని కారణంగా కార్యక్రమ తేదీ, సమయం ఫిక్స్ కాలేదన్న వార్తలు వస్తున్నాయి.




Updated : 23 Aug 2023 7:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top