Home > తెలంగాణ > ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకు పోడు భూమి పట్టా

ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకు పోడు భూమి పట్టా

ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకు పోడు భూమి పట్టా
X

తెలంగాణలో పోడు భూములకు పట్టాలు పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. దశాబ్దాల తరబడి గిరిజనులు సాగు చేసుకుని బతుకున్న పోడు భూములకు పట్టాలను పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులకు ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకు అధికారులు పోడు భూమి పట్టాను అధికారులు అందించారు. వాళ్లు ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూములకు పట్టాలను ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలలో ఏకంగా 4.60 లక్షల ఎకరాలకు పోడు పట్టాలను అందించి చరిత్ర సృష్టించింది. రికార్డు స్థాయిలో రాష్ట్రంలో 2,845 గ్రామాల్లో యాభై వేల రైతు కుటుంబాలకు సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలకు పట్టాలు అందజేశారు. పట్టాలను అందుకున్న వారికి రైతు భరోసా కూడా అందించడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Updated : 13 July 2023 8:36 PM IST
Tags:    
Next Story
Share it
Top