Home > తెలంగాణ > గద్దరన్నా నీవు చెప్పిన రాజకీయ సూచనలు మరవం: జనసేన

గద్దరన్నా నీవు చెప్పిన రాజకీయ సూచనలు మరవం: జనసేన

గద్దరన్నా నీవు చెప్పిన రాజకీయ సూచనలు మరవం: జనసేన
X

జనసేన తెలంగాణ విభాగం గద్దర్ మరణంపై ట్విటర్ వేదికగా సంతాపం వ్యక్తం చేసింది. ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు, ప్రజా యుద్ద నౌక మరణం.. తీవ్ర విషాదకరమని అన్నారు. తన పాటలతో, మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని సైతం ఉత్తేజపరిచిన విప్లవ వీరుడరి ట్వీట్ చేశారు. ‘తెలంగాణ ఉద్యమం కోసం తన గళంతో ప్రజా గళాన్ని వినిపించిన ప్రజా గాయకుడు "గద్దర్" అన్న హఠాన్మరణం బాధాకరం. "ప్రజా యుద్ద నౌక గద్దర్" గారి మృతి పట్ల కు

@JanaSenaParty తరపున, శ్రీ @PawanKalyan గారి తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నామ’ని ట్వీట్ చేశారు.

హాస్పిటల్ లో చికిత్స పొందిన గద్దర్ ను కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆ సమయంలో పవన్ కు గద్దర్ పలు రాజకీయ సూచనలను చేశారు. రాజకీయం అనేది పద్మవ్యూహం వంటిదని.. అతి జాగ్రత్తగా ముందుకెళ్లాలని సూచించారు.

Updated : 6 Aug 2023 6:17 PM IST
Tags:    
Next Story
Share it
Top