Home > తెలంగాణ > అందరి హీరోలా అభిమానులు జనసేనకు సపోర్ట్ చేయాలి : పవన్ కల్యాణ్

అందరి హీరోలా అభిమానులు జనసేనకు సపోర్ట్ చేయాలి : పవన్ కల్యాణ్

అందరి హీరోలా అభిమానులు జనసేనకు సపోర్ట్ చేయాలి : పవన్ కల్యాణ్
X

సినిమాను, రాజకీయాన్ని యువత వేరు చేసి చూడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అందరి హీరోల అభిమానులు జనసేనకు సపోర్ట్ చేయాలని కోరారు. ఎన్టీఆర్, రామచరణ్, ప్రభాష్, రవితేజ లంటే తనకు కూడా ఇష్టమని చెప్పారు. వారాహి యాత్రలో భాగంగా కాకినాడలో పవన్ ప్రసంగిస్తూ కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

"సీఎం అండ చూసుకుని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి రెచ్చిపోతున్నారు. ద్వారంపూడి ఇంట్లోని అందరూ గూండాలే. అతని కుటుంబ సభ్యులకు గతంలో బేడీలు వేశారు. ప్రస్తుతం చంద్రశేఖర్‌రెడ్డి నేర సామ్రాజ్యం నడుపుతున్నారు. బియ్యం ఎగుమతి చేసి రూ.15వేల కోట్లు దోచేశారు.కాపు మహిళలను కాపు రౌడీలతో కొట్టించారు.

నాకు అవకాశం వస్తే ఈ గూండాలను తన్నుకుంటూ తీసుకెళ్తా. మా నేతలను అసెంబ్లీకి పంపండి.. దోపిడీని అడ్డుకుని చూపిస్తాం. కాకినాడ నుంచి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మరోసారి గెలవనీయను. కాకినాడ జిల్లాను ద్వారంపూడి లూటీ చేస్తున్నారు. ఈసారి అసెంబ్లీకి ఎలా వెళ్తారో చూస్తా. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. అధికార పార్టీ ఎంపీ కుటుంబానికి రక్షణ లేకుండా పోయింది. గంజాయి మత్తులో యువత నేరాల బాట పడుతున్నారు. శాంతి భద్రతలపై విశాఖలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు లోతుగా అర్థం చేసుకోవాలి.మన రాష్ట్రంలో కులం అనే భావన అందరిలో ఉంది. మన రాష్ట్రం మన ఏపీ అని అందరూ అనుకోవాలి" అని పవన్ కల్యాణ్ తెలిపారు.

Updated : 18 Jun 2023 10:46 PM IST
Tags:    
Next Story
Share it
Top